Bheemudu : భీముడు - Bheeshmudu : భీష్ముడు

Bheemudu : భీముడు - Bheeshmudu : భీష్ముడు

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు

Bheemudu : భీముడు - 

భయమును కలిగించువాడు . 

భీముడు పాండవ ద్వితీయుడు. మహాభారత ఇతిహాసములో వాయుదేవుడి అంశ. పాండురాజు సంతానం. 

కుంతికి వాయుదేవునికి కలిగిన సంతానం. ద్రౌపతి , హిడింబి ఇతని భార్యలు . హిడింబాసురుణ్ణి వధించి తనని వరించిన ఆతని సోదరి హిడింబి అను రాక్షస వనితను కుంతీ ధర్మరాజాదుల అనుమతితో వివాహమాడినాడు. 

వారిరువురికీ కలిగిన సంతానమే మహాభారత యుద్దమందు తన మాయాజాలముతో వీరంగము చేసి ప్రసిద్దుడైన ఘటోత్కచుడు. 

కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని నిర్జించినాడు. ధుర్యోధన దుశ్శాసనాది కౌరవులు నూర్గురినీ భీమసేనుడే వధించినాడు.



Bheeshmudu : భీష్ముడు - 

తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన (భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు. 

ఆ జన్మ భ్రహ్మచారి . మహాభారతంలో గంగాదేవీ శంతనమహారాజుకి జన్మించినాడు , భీష్ముడు పూర్వ నామం "దేవవ్రతుడు". 

భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది.


Post a Comment

0 Comments