కంచి పరమాచార్య వైభవం
Kanchi Paramacharya Vaibhavam telugu lo stories devotional Hindu
పరమాచార్య స్వామి - పౌర్ణమి దర్శనం
పరమాచార్య స్వామివారు కరుణాముర్తి అయిన మహదేవ స్వరూపులు. వారిని శరణు కోరిన వారిని రక్షించే దయామయుడు. సృష్టిలోని అన్ని జీవాలకు ఆయనే తల్లి, తండ్రి మరియు గురువు. మహాస్వామివారు ఒక సన్యాసి అయినప్పటికీ అందరిని తన పిల్లలుగా బావిస్తారు అని నా అభిప్రాయం.
అయన కారుణ, దయ పంచేటప్పుడు వాటికి ఎలాంటి హద్దులు ఉండవు.
మహాస్వామి వారు ఒక మహోన్నతమైన శక్తి. ఎల్లప్పుడూ అంతటా ఉంది మరియు ఉంటుంది.
వారి సహాయకులు, సహాయం కోరి వెళ్ళినవారూ వాళ్ళ అనుభవాలని బహువిధాలుగా చెప్పుకుంటారు.
నాకు తెలియకుండానే నాకు పరమాచార్య స్వామిపై అపారమైన భక్తి ఏర్పడింది. నాకు సమయం దొరికినప్పుడల్లా వారి దర్శనం చేసుకుంటాను. ఒకసారి నాకు శ్రీ ప్రదోష వెంకటరామన్ అయ్యర్ గారితో పరిచయం కలిగింది.
అయన ప్రతి పౌర్ణమి రోజు మహాస్వామి వారిని దర్శనం చేసుకోమని సూచించారు.
అలా ఒకసారి నేను బొంబాయి నుండి దర్శనానికై వస్తున్నప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు అరక్కోణం రావాల్సిన రైలు రాత్రి ఎనిమిది గంటలకు చేరింది.
అక్కడనుండి నేను బస్సు ఎక్కి కాంచీపురం శ్రీమఠం చేరుకునేసరికి దాదాపు రాత్రి తొమ్మిది గంటలు అయ్యింది. జస్టిస్ శ్రీ మిశ్ర గారు దర్శనం చేసుకొని అప్పుడే బయటకు వస్తున్నారు.
నేను అక్కడ ఉన్న సిబ్బందితో, “నేను మహాస్వామి వారి దర్శనం చేసుకొని 11:30 గంటలకు ఆ రాత్రికే అరక్కోణంలో రైలు ఎక్కాలి” అని చెప్పాను. అందుకు వాళ్ళు, ”ఈపాటికి మహాస్వామి వారు విశ్రాంతి తీసుకుంటు ఉంటారు.
మళ్ళా తరువాతి దర్శనం రేపు ఉదయంమే” అని చెప్పరు. నేను కొద్దిసేపు ఏం చేయాలో అర్ధం కాక నిస్సహాయంగా అక్కడే ఉండిపోయాను.
అశ్చర్యకరంగా మహాస్వామి వారు మరుక్షణమే నాకు దర్శనం ప్రసాదించారు. నావైపు చూస్తూ, ”ఏమి తీసుకువచ్చావు?” అని అడిగారు. నేను “కొన్ని పళ్ళు తీసుకువచ్చాను” అని చెప్పాను. వారు అందులో కొన్నింటిని తీసుకొని మిగిలినవి అందరికి పంచమని చెప్పారు.
స్వామి వారి వద్దనుండి సెలవు తీసుకొని రాత్రి 10:30 కి అక్కడనుండి బయలుదేరాను. కాంచీపురం నుండి అరక్కోణంకు చివరి బస్సు 9:10కి కాబట్టి అది వెళ్లిపోయింది.
నేను ఒక ఆటోరిక్షా లో బయలుదేరాను. మధ్యలో ఏదో సమస్య వల్ల ఆటో ఆగిపోంది. ఆటోడ్రైవర్ రైలు అందుకోవడం కష్టం అని చెప్పాడు. ఆటోను బాగు చేసి ప్రయాణించిన తరువాత మేము అరక్కోణం చేరేసరికి రాత్రి 12:30 గంటలు అయింది.
నేను గబా గబా ఫ్లాట్ ఫారం మీదకు వెళ్ళాను. అప్పుడే నేను ఎక్కవలసిన రైలు ప్లాట్ ఫారం మీదకు వస్తున్నది. పరమాచార్య స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైలెక్కాను. ఇది నా జీవితం లో మరిచిపోలేని సంఘటన.
--- వి.వి. రమణి, ముంబై. మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్ - 2
-------------------------------------------------
0 Comments