telugu lo devotional data sri sri kanya kurichi amma rakshana

telugu lo devotional data sri sri kanya kurichi amma rakshana

కంచి పరమాచార్య వైభవం.telugu lo devotional data sri sri kanya kurichi amma rakshana 

శ్రీ కన్యకురిచి అమ్మ రక్షణ

ఒక రోజు ఒక పెద్దమనిషి పరమాచార్య స్వామి వారి దర్శనం కోసం పట్టుకోట్టై అనే పట్టణం నుండి వచ్చాడు. దర్శనం అనంతరం మహాస్వామి వారితో "నేను ఒక కొత్త కారు కొన్నాను. దాన్ని తీసుకున్నప్పటి నుండి చాలా ప్రమాదాలు జరిగాయి. నేను చాలా మంది జ్యోతిష్కులను అడుగగావారు ఎన్నో పరిహారాలు చెప్పారు. వారు చెప్పినవన్నీ చేయించాను కాని ఏమి ఉపయోగం లేదు” అని అన్నాడు.

మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత ఆ పెద్దమనిషిని "మీ ఊరి సమీపంలో కన్యకురిచి అనే ఊరు ఉన్నదా?" అని ప్రశ్నించారు.

ఆ మాటవిని ఆ పెద్దమనిషి చాలా ఆశ్చర్యపోయాడు.

మహాస్వామి వారు ఆ పెద్దమనిషితో "అక్కడ ఒక మహామాయా దేవి ఆలయం ఉన్నది. చాలా శక్తి వంతమైన దేవీ స్వరూపం. ఒక యాభై రూపాయలు పంపి అక్కడ ఉన్న అమ్మవారికి అభిషేకము చేయించు. నీ కారు ముందు కన్యకురిచి అమ్మవారి ప్రసన్నః” అని అమ్మ రక్షణలో ఈ కారు ఉంది అని రాయించు” అని చెప్పారు.

ఆ పెద్దమనిషి నిశ్చేష్టుడయ్యినోట మాటరాక అలా నిలబడిపోయాడు. కొద్దిసేపటి తరువాత తేరుకొనిస్వామివారితో "పెరియవ! శ్రీ కన్యకురిచి అమ్మవారు మా ఇంటిదేవతవంశపారంపర్యంగా మా ఆరాధ్య దైవం. మా తల్లితండ్రులు ప్రతి సంవత్సరము అక్కడకి వెళ్లి అమ్మవారికి అభిషేకం చేయించేవారు. మా కుటుంబం లోని చిన్నపిల్లలకు అక్కడే పుట్టువెంట్రుకలు తీయించేవారు. కాలక్రమములో మేము ఇవన్ని మరిచిపోయము. శ్రీ మహాపెరియవ దయ వలన మరియు మా అదృష్టం వల్ల మళ్ళీ మాకు గుర్తుచేసారు" అని స్వామివారికి సాష్టాంగం చేసి ఆనందంతో వెళ్ళిపోయాడు.

శ్రీ మహామాయ దేవి రక్షణ వల్ల ఆ కారుకి తరువాత ఎటువంటి ఆపదలు రాలేదు.


--- శ్రీ మఠం బాలు మామమహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్.

Post a Comment

0 Comments