shiva soul శివుడి మనసు గెలుచుకోవడానికి

  shiva soul   శివుడి మనసు గెలుచుకోవడానికి
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
  shiva soul శివుడి మనసు గెలుచుకోవడానికి....స్వచ్ఛమైన జలంతో సదాశివుడికి అభిషేకం

పరమశివుడి లీలా విశేషాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి శివుడి మనసు గెలుచుకోవడానికి అభిషేకానికి మించిన సాధనలేదు. ఆలయాలలో భక్తులు శివలింగానికి వివిధరకాల పూజాద్రవ్యాలతో అభిషేకం జరుపుతుంటారు. ఒక్కో అభిషేక ద్రవ్యం వలన ఒక్కో పుణ్యవిశేషం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలా సదాశివుడు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను అందిస్తుంటాడు.

ఎవరి మనోభీష్టానికి తగినట్టుగా వారికి వరాలను ప్రసాదిస్తుంటాడు. ఈ నేపథ్యంలో స్వచ్ఛమైన జలంతో సదాశివుడికి అభిషేకం చేయడం వలన పాపాలు నశిస్తాయి. తెలిసీ తెలియక కొన్నిరకాల పాపాలకు కారణం కావడం జరుగుతూ వుంటుంది.
పాపాల ఫలితాలు వివిధ రకాల అనారోగ్యాలకు దారితీస్తుంటాయి. ఆర్ధికపరమైన ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. జీవితంలో అవసరమైన అభివృద్ధిని సాధించడానికి అడ్డుపడుతుంటాయి. అలా బాధలకు గురిచేసే పాపాలన్నీ కూడా పరమశివుడిని స్వచ్ఛమైన జలాలతో అభిషేకించడం వలన పటాపంచలవుతాయని పండితులు అంటున్నారు.

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

Post a Comment

0 Comments