దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం) daiva sura sampada yogam telugu bhagavad gita

దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం) daiva sura sampada yogam telugu bhagavad gita

దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం) daiva sura sampada yogam telugu bhagavad gita 

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం)

శ్రీకృష్ణుడు చెపుతున్నాడు.

దైవగుణాలు:

భయం లేకుండడం,నిర్మల మనసు,అధ్యాత్మిక జ్ఞాన నిష్ఠ,ఆత్మనిగ్రహం,యజ్ఞాచరణ,వేదాధ్యయనం, 
తపస్సు,సరళత,అహింస,సత్యం,కోపం లేకుండడం,త్యాగం,శాంతి,దోషాలు ఎంచకుండడం, మృదుత్వం,భూతదయ,లోభం లేకుండడం,అసూయ లేకుండడం,కీతి పట్ల ఆశ లేకుండడం.

రాక్షసగుణాలు:
గర్వం,పొగరు,దురభిమానం,కోపం,పరుషత్వం,అవివేకం.

దైవగుణాలు మోక్షాన్ని,రాక్షసగుణాలు సంసారబంధాన్ని కలిగిస్తాయి.నీవు దైవగుణాలు కలిగినవాడివి, బాధపడద్దు.
దైవ,రాక్షస స్వభావులని రెండు రకాలు.రాక్షసస్వభావం గురించి చెప్తాను.
మంచీచెడుల విచక్షణ,శుభ్రత,సత్యం,మంచి ఆచారం వీరిలో ఉండవు.
ప్రపంచం మిథ్య అని,దేవుడు లేడని,స్త్రీపురుష సంయోగం చేతనే సృష్టి జరుగుతోందని కామమే కారణమని అని వాదిస్తారు.
వీరు లోకకంటకమైన పనులు చేస్తారు.కామం కలిగి దురభిమానం,డంభం,మదం,మూర్ఖ పట్టుదల కలిగి అపవిత్రంగా ఉంటారు.
కామం,కోపాలకు బానిసలై,విషయవాంఛలే ముఖ్యంగా వాటి అనుభవం కోసం అక్రమ ధనార్జన చేస్తూ నిత్యం ఆశలలో చిక్కుకొని ఉంటారు.

"ఇది నాకు దొరికింది.దీనితో ఈ కోరిక తీర్చుకుంటాను.నాకు ఇంత ఉంది,ఇంకా వస్తుంది.ఈ శత్రువును చంపాను.మిగిలిన శత్రువులందరినీ చంపుతాను.నేను సర్వాధికారిని. బలవంతుడిని,సుఖిని,ధనికుడిని.నాకెదురు లేదు.నాకు ఎవరూ సమానం కాదు.యాగలూ,దానాలూ చేస్తాను.నేనెప్పుడూ సంతోషినే"అని అనుకుంటూ కామం,భోగాలలో మునిగి చివరకు నరకంలో పడతారు.
ఆత్మస్తుతి,డబ్బు మదం తో శాస్త్రాన్ని వీడి పేరుకు మాత్రం డాంబికంగా యాగాలు చేస్తారు.అన్ని దుర్గుణాలు కలిగి అసూయతో అంతర్యామి నైన నన్ను తిరస్కరిస్తారు.
వీరు తిరిగితిరిగి ఇలాంటి జన్మలే పొందుతారు.వీరు ఎన్నటికీ నన్ను చేరలేక అంతకంతకూ హీనజన్మలనే పొందుతుంటారు.
కామం,కోపం,పిసినారితనం ఈ మూడూ నరకానికి తలుపులు.ఆత్మజ్ఞానమును నాశనం చేస్తాయి.కాబట్టి ఈ మూడింటినీ వదిలిపెట్టాలి.
Magha pornani   మాఘ పౌర్ణమి విశేషం ఏంటి ? http://knowledgebase2u.blogspot.com/2015/05/madha-pornani.html
Magha snanam మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :- http://knowledgebase2u.blogspot.com/2015/05/magha-snanam.html
Lakshmi sthothram లక్ష్మీ స్తోత్రం http://knowledgebase2u.blogspot.com/2015/05/lakshmi-sthothram.html
Vidhura, vibhishana viswarupudu విదురుడు విభీషణుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/vidhura-vibhishana-viswarupudu.html
Viswamitra విశ్వామిత్రుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/viswamitra.html


Yashoda, yaagyavalkudu యశోద యాజ్ఞవల్కుడు http://knowledgebase2u.blogspot.com/2015/05/yashoda-yaagyavalkudu.html
వీటిని వదిలిన వాడే తపస్సు,యాగం మొదలగు వాటి వలన ఆత్మజ్ఞానం కలిగి మోక్షం పొందుతారు.
వేదశాస్త్రాలను లక్ష్యపెట్టని వారికి శాంతి లేక మోక్షం లభించవు.
కాబట్టి ఏ పనిచెయ్యాలి,చేయకూడదు అన్నదానికి వేదశాస్త్రాలే నీకు ప్రమాణం.వాటి ప్రకారమే నీ కర్మలను చెయ్యి.

devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus

Post a Comment

0 Comments