sri bhagavad gita telugu font pdf part 1

sri bhagavad gita telugu font pdf part 1

sri bhagavad gita telugu font pdf part 1


devotional data sri bhagavad geetha


అర్జున విషాద యోగము ఈ అధ్యాయం మొదటిది.
ధృతరాష్ట్రుడు సంజయుడితో మొదటిరోజు యుద్ధ విశేషాలు అడిగాడు.అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు.
కౌరవులు,పాండవులు వారివారి బలాల గురించి,యోధుల గురించి అలాగే ఎదుటివారి 
బలాల,యోధుల గురించి పన్నిన,పన్నవలసిన వ్యుహాలగురించి మాట్లాడుకున్నారు.
అప్పుడు కౌరవులబలం,వారిలోని యోధుల గురించి తెలుసుకొనే నిమిత్తం అర్జునుడు తన బావ మరియు సారథి ఐన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు.కృష్ణుడు అలానే చేసాడు.
అప్పుడు అర్జునుడు కౌరవులలోని తన పెదనాన్న బిడ్డలను,గురువులను,వయోవృద్ధులను అనగా భీష్ముడు,ద్రోణుడు,కృపాచార్యుడు మొదలగు పెద్దలను చూసి గుండె కరిగిపోయి కృష్ణునితో ఈ విధంగా అన్నాడు.

"కృష్ణా! అందరు మనవాళ్ళే,వారిలో కొందరు పుజ్యనీయులు.వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏవిధంగా సుఖపడగలను?అయినా జయాపజయాలు దైవాధీనాలు కదా.ఎవరు గెలుస్తారో తెలియదు.వారు నన్ను చంపినా నేను మాత్రం వారిని చంపను.దుఃఖం చేత నేను,నా అవయవాలు స్థిమితం కోల్పోతున్నాయి"అని అంటూ తన ధనుర్బాణాలు వదిలివేసి దుఃఖించసాగాడు.

ఇక్కడితో మొదటి అధ్యాయం పూర్తవుతుంది. ************

Post a Comment

0 Comments