amma cheppina abaddalu telugu lo stories kathalu

amma cheppina abaddalu telugu lo stories kathalu

అమ్మ చెప్పిన అబద్ధాలు amma cheppina abaddalu telugu lo stories kathalu

అమ్మలెప్పుడూ నిజం చెప్పరు. వాళ్లను మించిన అబద్ధాలకోర్లు ఈ ఆకాశం కింద లేరు. కావాలంటే చదవండిది. ఈ కథ నా చిన్నప్పుడు మొదలైంది. నేను చాలా పేదరికంలో పుట్టాను. పూటపూటకూ తిండి వెతుక్కునేంత పేదరికం. ఎప్పుడైనా ఇంట్లో అన్నం ఉంటే మా అమ్మ తను తినాల్సిన అన్నం కూడా నాకే పెట్టేది. నా గిన్నెలో అన్నం పెడుతూ- నువ్వు తిను నాన్నా నాకిప్పుడు ఆకలిగా లేదులే అనేది. అది అమ్మ చెప్పిన మొదటి అబద్ధం. అప్పుడప్పుడూ మా అమ్మ ఊరి దగ్గరిలోని వాగులో చేపలు పట్టేది. ఎదిగే బిడ్డకు కాస్తంత పోషకాహరం పెట్టాలని ఆమె ఆశ.

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, kids stories telugu lo, god stories, good stories, devatha kathalu friendship kathalu

కొనలేదు కాబట్టి వాగు దగ్గర గంట్లు గంటలు పడిగాపులు పడేది. ఒకటో రెండో చిన్న చేపలు దొరికేవి. అలాంటప్పుడు నాకు వంటిపెట్టి నేను తిన్నాక మిగిలిన చేపముక్కకు ఏమైనా కండ ఉంటే దాన్ని అమ్మ తినేది. ఊహ తెలిశాక అది చూసి నాకు కష్టమనిపించేది. నేను నా గిన్నెలోంచి ఓ చేపముక్క అమ్మకు వేయబోతే చేయి అడ్డంగా పెట్టి వారిస్తూ- వద్దు నాన్నా నాకసలు చేపల వాసనే పడదు అనేది. అది అమ్మ చెప్పిన రెండో అబద్ధం. నన్ను బడిలో చేర్పించేందుకు అమ్మ పనిలో కుదిరింది. పాత పేపర్లు తెచ్చి వాటిని జిగురుతో కవర్లు చేసి ఊళ్లో దుకాణాలకు ఇచ్చేది. ఒకసారి నాకు మెలకువ వచ్చి చూస్తే అమ్మ అర్ధరాత్రి కూడా గుడ్డిదీపం వెలుగులో కవర్లు చేస్తూ కనిపించింది. నేను ఎందుకమ్మా ఇంత రాత్రయినా కష్టపడతావు అని అడిగితే.. నువ్వు నిద్రపో నేనేమీ అలసి పోలేదు అనేది. అది అమ్మ చెప్పిన మూడో అబద్ధం. నా ఫైనల్ ఎగ్జామ్స్‌కు అమ్మ తోడొచ్చింది. నేను లోపల పరీక్ష రాస్తుంటే తను బయట మండే ఎండలో గంటలు నిరీక్షించింది. బెల్ కొట్టగానే ఎదురొచ్చి నన్ను వాటేసుకుంది. ఒడిలో కూర్చోబెట్టుకుని తను తెచ్చిన పళ్లరసం గ్లాసులో పోసి తాగమంది. కానీ ఎండకు అమ్మ ఒడిలిపోయింది. చెంపలమీద కారుతున్న చెమటను చూసి నువ్వూ తాగమ్మా అని నేను గ్లాసు అందించాను. కానీ, అమ్మ తాగలేదు. వద్దు నాన్న, నాకసలు దాహమే లేదు
అన్నది. అది అమ్మ చెప్పిన నాలుగో అబద్ధం. అమ్మ నన్ను తన శక్తిమేరా చదివించింది. దాంతోనే నేను సిటీకెళ్లి పొట్టనింపుకొనేంత జీతమొచ్చే పనిలో కుదిరాను. అమ్మకు ఇకనైనా కాస్త విశ్రాంతి ఇవ్వాలని కొంతలోకొంత మిగిల్చి ఆమెకు పంపాను. కానీ అమ్మ ఆ డబ్బులు వద్దంది. నన్ను కడుపు కాల్చుకోవద్దంది. పుట్టిన రోజుకు బట్టలు కొనుక్కోమంది. కూరగాయలతో, కవర్లు చేయడంతో నాకొచ్చే పైసలు చాలు నాన్న, నాకే లోటూ లేదు అన్నది. అది అమ్మ చెప్పిన అయిదో అబద్ధం. చివరకు అమ్మకు జబ్బు చేసింది. ఊళ్లో హాస్పిటల్లో చేర్చి నాకు కబురు చేశారు. నేను సముద్రం దాటి ఆగమేఘాలమీద ఊరికి వచ్చాను. అమ్మ మంచాన పడింది. ఎముకల పోగులా మిగిలింది. నన్ను చూసి నవ్వాలనుకుంది. కానీ, ఆ నవ్వు లోతుకుపోయిన కళ్లను దాటి బయటకు రాలేదు. నాకు ఏడుపు తన్నుకొచ్చింది. ఆ మంచం మీద కూలబడ్డాను. అమ్మ నా తల మీద చేయి పెట్టి నిమురుతూ ఏడవకు నాన్నా, నాకేమీ కాలేదు. నేను బాగానే ఉన్నా కదా అన్నది. అది అమ్మ చెప్పిన ఆరో అబద్ధం. ఆఖరి అబద్ధం. ఏడో అబద్ధం చెప్పడానికి అమ్మ బతికి లేదు.

monkey kothi telugu lo stories kathalu, Telugu Stories, Telugu Kathalu, Kadalu, Kadhalu, Neethi Kathalu, Kids Kathalu, chinna pilla la kathalu, buddi kathalu, neethi pilla la kathalu, comedy kathalu, moral stories, chanda mama kathalu, tenali rama krishna kathalu, jokes, telugu joke kathalu, papa la kathalu, bujji kathalu, chinnari kathalu, bangaru kathalu,  telugu good stories, telugu children stories, moral stories kids, telugu lo moral stories, telugu lo kids stories, kids stories telugu lo, god stories, good stories, devatha kathalu friendship kathalu

Post a Comment

0 Comments