telugu lo devotional data news దాన మహిమ dana mahima

దాన మహిమ - telugu lo devotional data news దాన మహిమ dana mahima 

దానం చెయ్యాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలా మందికి దానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం తెలియక దానధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తుంటారు. మన వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లే మనకు కామితార్ధాలు అన్నీ సమకూరతాయని తెలియజేస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కధే ఇది

బలి చక్రవర్తి గతజన్మ వృత్తాంతం:

బలి చక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్ శ్రీమహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గతజన్మలో చేసుకొన్న పుణ్యమే. బలి గతజన్మలో ఒక దరిదృడు. అతను నాస్తికంగా ఉంటూ వేదపండితులనూ దేవతలనూ నిత్యం దూషిస్తూ తిరుగుతుండేవాడు. అతను దరిదృడే ఐనా వేశ్య లోలుడు. ఒక సారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ, శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది భోగవస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యావాటిక కి బయల్దేరాడు. మార్గమధ్యంలో కాలుజారి నేలమీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్చపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళద్రవ్యాలన్నీ శివుడికి నివేదనచేస్తున్నట్టు. ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు. తన దగరున్న సర్వస్వాన్నీ భగవంతుడికి నివేదించినందుకు గానూ ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది.

మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకి గానూ ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరలో తనయావత్తూ ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టూ భావించినందుకు మూడు ఘడియలపాటూ ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందంది అలా మూడు ఘడియలూ పూర్తయ్యాకా అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళూ చేసినపనులెంత ఘోరమైనవో తెలిసింది. జన్మ చివరలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది, అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుందీ ? అనిపించింది. ఇంతలో ఇందృడు, ఇంద్రగణాలు, అప్సరాగణాలూ మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంచనాలతో సదరంగా స్వర్గానికి తోడుకొని వెళ్ళారు.

తను ఇంద్ర సిమ్హాసనమ్మీద కూర్చొన్న వెంఠనే అగస్త్యుడికి ఐరావతాన్నీ, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్నీ, వశిష్టుడికి కామధేనువునూ, గాలవుడికి చింతామణినీ, కౌండిణ్యుడికి కల్పతరువునూ ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా దానం చేసేసాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు.

మూడు ఘడియల కాలం ఐపోయిన వెంఠనే ఇందృడక్కడకి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకూ అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చెయ్యడం తెలుసుకొని కోపగించుకొన్నాడు. ఇంతలో యముడూ అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధంకమ్మన్నాడు. ఐతే మరలా చిత్రగుప్తుడు అడ్డుచెప్పి అతను ఈ మూడు ఘడియలకాలంలో చేసిన పుణ్య ఫలితంవల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదనీ, మరు జన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడనీ చెప్పాడు. తను మునుపు చేసిన పనులకి గానూ అసుర వంశానికి రాజౌతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగనే బలి చక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువుకే మూడు అడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు




చందమామ కథలుLike Page
December 27 at 8:13pm
కం:
విల్లును విరిచావట ఆ
తల్లిని గెలిచితి వట అది తధ్యము నిజమే !!
చెల్లెను ఆ పనులపుడే
వల్లవునా ఇపుడు రామ వనితిను గెల్వన్ ?
మంటల దింపితి వామెను
అంపితివి గదా అడవికి అప్పటి యుగమున్
మంటలు మా పాలి ఇపుడు
కంటిలొ నలుసాయెనయ్య కలియుగ కాంతల్
అడవికి నీతో వచ్చెను
పడ దోసిన మంటలందు పరుషములనెనా ?
గడుసుగ మాటొకటను ఇపు
డు డమరములు మోగు నయ్య డస్సును
చెవుల్ !!


Hindhu hanuman senaLike Page
December 27 at 4:36pm
🌹ఆయుత చండీయాగము 🌹 అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న అయుత చండీయగానికి సంబంధించి అసలేం జరుగుతుందంటే.. ఎవరూ స్పష్టంగా చెప్పేది లేదు. ఇంతకీ ఈ చండీయాగం జరిగే రోజుల్లో ఏం చేస్తారు? అదెంత భారీగా అన్న విషయంపై చాలామందికి స్పష్టత లేదు. ఎంతమంది భోజనాలు చేయనున్నారు? ఎంతమంది ప్రముఖులు వస్తున్నారు?ఎంత భారీగా ఏర్పాట్లు చేశారన్న విషయాలపై మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ.. చండీ అంటే ఏమిటి? ఆ యాగం సందర్భంగా రుత్వికులు ఏం చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై ప్రధానార్చకులు పురాణం మహేశ్వర శర్మ యాగానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు చెప్పుకొచ్చారు. అవేమంటే..

=చండీ అంటే ఒక స్తోత్రం. వ్యాసుడు 18 పురాణాలు రాసి.. ఒక్కొక్క పురాణంలో ఆయా దేవతల గొప్పతనాన్ని వివరిస్తూ అవసరం వచ్చినప్పుడు వారిని కీర్తించారు. మార్కండేయ పురాణంలోనిదీ చండీ స్తోత్రం.

= ఇందులో 700 శ్లోకాలు ఉంటాయి. మిగిలిన స్తోత్రాల కంటే ఇది చాలా విశేషమైంది.

= మిగిలిన స్తోత్రాల్ని పఠించి.. అనుష్టానం చేస్తే ఫలితం వస్తుంది. కానీ.. చండీ స్తోత్రాన్ని వింటేనే ఫలితం వస్తుందన్నది నమ్మకం.

= చండీ విధానంలో నవచండీ.. శత చండీ.. సహస్ర చండీ.. లక్ష చండీ.. కోటి చండీలు ఉన్నాయి.

= మన దేశంలో లక్ష చండీలు చేశారు.

= శృంగేరీ బయట చేస్తున్న అయుత చండీ ఇదే మొదటిది కావొచ్చు.

= నవాక్షరీ మంత్రం ఉపదేశం తీసుకున్న వారు మాత్రమే చండీ పారాయణం చేస్తారు.

= దీన్ని ప్రతి రుత్వికుడు తొలి రోజు 4వేలు.. రెండో రోజు 3 వేలు.. మూడో రోజు 2వేలు.. నాలుగురోజు వెయ్యి చొప్పున మూలమంత్రం చేస్తారు.

= అంటే.. యాగం పూర్తయ్యే నాటికి మొత్తం కోటి జపం పూర్తి అవుతుంది.

= ప్రతి రుత్వికుడు చండీపారాయణాన్ని తొలిరోజు ఒకసారి ప్రారంభించి.. నాలుగు రోజులు గడిచేసరికి పదిసార్లు పూర్తి చేస్తారు.

అయుత చండీ యాగం హైలెట్స్ చూస్తే..

= అయుతం అంటే సంస్కృతంలో పదివేలు. 10వేల చండీ సప్తశతీ పారాయణాలు పూర్తి చేసి అందులో పదోవంతు హోమం చేసి పూర్ణాహుతులు సమర్పించటమే అయుత చండీయాగంగా చెప్పొచ్చు.

= ఈ మహా క్రతువును ఏకోత్తర వృద్ధి విధానంలో శృంగేరీ పీఠ సంప్రదాయంలో నిర్వహిస్తారు.

= ఈ మహా క్రతువులో 1100 మంది రుత్వికులు.. ఏక కంఠంతో సప్తశతీపారాయణం చేస్తారు.

= ఐదు రాష్ట్రాల నుంచి 1500 మంది రుత్వికులు పాల్గొంటున్నారు.

= మొత్తం 40 ఎకరాల్లో సాగుతున్న ఈ కార్యక్రమంలో మొత్తంగా 3 ఎకరాలు కేవలం యాగశాల కోసం కేటాయించారు.

= 108 హోమ గుండాలు సంప్రదాయ సిద్ధంగా తయారు చేశారు.

= 2011 ఏప్రిల్ లో కర్ణాటకలోని శృంగేరీలో అయుత చండీయాగం నిర్వహించారు. ఆ తర్వాత ఏకోత్తర వృద్ధి విధానంలో ఎర్రవల్లిలో జరుగుతోంది.

= ఈ యాగం కోసం 30 టన్నుల (టన్ను అంటే వెయ్యి కిలోలు) మోదుగ సమిధలు.. 12 టన్నుల పాయసం.. 4వేల కిలోల ఆవునెయ్యి.. రోజూ వెయ్యి కమలాలతో హోమం.

= రోజువారీగా ప్రసాదాల కోసం ఇప్పటికి 3 లక్షల లడ్డూలు తయారు చేశారు.

= రోజూ 50 వేల మందికి భోజనాలు వడ్డించనున్నారు.




కంచి పరమాచార్య వైభవం
పరమాచార్య స్వామి - పౌర్ణమి దర్శనం

పరమాచార్య స్వామివారు కరుణాముర్తి అయిన మహదేవ స్వరూపులు. వారిని శరణు కోరిన వారిని రక్షించే దయామయుడు. సృష్టిలోని అన్ని జీవాలకు ఆయనే తల్లి, తండ్రి మరియు గురువు. మహాస్వామివారు ఒక సన్యాసి అయినప్పటికీ అందరిని తన పిల్లలుగా బావిస్తారు అని నా అభిప్రాయం.

అయన కారుణ, దయ పంచేటప్పుడు వాటికి ఎలాంటి హద్దులు ఉండవు. మహాస్వామి వారు ఒక మహోన్నతమైన శక్తి. ఎల్లప్పుడూ అంతటా ఉంది మరియు ఉంటుంది. వారి సహాయకులు, సహాయం కోరి వెళ్ళినవారూ వాళ్ళ అనుభవాలని బహువిధాలుగా చెప్పుకుంటారు.

నాకు తెలియకుండానే నాకు పరమాచార్య స్వామిపై అపారమైన భక్తి ఏర్పడింది. నాకు సమయం దొరికినప్పుడల్లా వారి దర్శనం చేసుకుంటాను. ఒకసారి నాకు శ్రీ ప్రదోష వెంకటరామన్ అయ్యర్ గారితో పరిచయం కలిగింది. అయన ప్రతి పౌర్ణమి రోజు మహాస్వామి వారిని దర్శనం చేసుకోమని సూచించారు.

అలా ఒకసారి నేను బొంబాయి నుండి దర్శనానికై వస్తున్నప్పుడు సాయంత్రం నాలుగు గంటలకు అరక్కోణం రావాల్సిన రైలు రాత్రి ఎనిమిది గంటలకు చేరింది. అక్కడనుండి నేను బస్సు ఎక్కి కాంచీపురం శ్రీమఠం చేరుకునేసరికి దాదాపు రాత్రి తొమ్మిది గంటలు అయ్యింది. జస్టిస్ శ్రీ మిశ్ర గారు దర్శనం చేసుకొని అప్పుడే బయటకు వస్తున్నారు.

నేను అక్కడ ఉన్న సిబ్బందితో, “నేను మహాస్వామి వారి దర్శనం చేసుకొని 11:30 గంటలకు ఆ రాత్రికే అరక్కోణంలో రైలు ఎక్కాలిఅని చెప్పాను. అందుకు వాళ్ళు, ”ఈపాటికి మహాస్వామి వారు విశ్రాంతి తీసుకుంటు ఉంటారు. మళ్ళా తరువాతి దర్శనం రేపు ఉదయంమేఅని చెప్పరు. నేను కొద్దిసేపు ఏం చేయాలో అర్ధం కాక నిస్సహాయంగా అక్కడే ఉండిపోయాను.

అశ్చర్యకరంగా మహాస్వామి వారు మరుక్షణమే నాకు దర్శనం ప్రసాదించారు. నావైపు చూస్తూ, ”ఏమి తీసుకువచ్చావు?” అని అడిగారు. నేను కొన్ని పళ్ళు తీసుకువచ్చానుఅని చెప్పాను. వారు అందులో కొన్నింటిని తీసుకొని మిగిలినవి అందరికి పంచమని చెప్పారు.

స్వామి వారి వద్దనుండి సెలవు తీసుకొని రాత్రి 10:30 కి అక్కడనుండి బయలుదేరాను. కాంచీపురం నుండి అరక్కోణంకు చివరి బస్సు 9:10కి కాబట్టి అది వెళ్లిపోయింది. నేను ఒక ఆటోరిక్షా లో బయలుదేరాను. మధ్యలో ఏదో సమస్య వల్ల ఆటో ఆగిపోంది. ఆటోడ్రైవర్ రైలు అందుకోవడం కష్టం అని చెప్పాడు. ఆటోను బాగు చేసి ప్రయాణించిన తరువాత మేము అరక్కోణం చేరేసరికి రాత్రి 12:30 గంటలు అయింది.

నేను గబా గబా ఫ్లాట్ ఫారం మీదకు వెళ్ళాను. అప్పుడే నేను ఎక్కవలసిన రైలు ప్లాట్ ఫారం మీదకు వస్తున్నది. పరమాచార్య స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైలెక్కాను. ఇది నా జీవితం లో మరిచిపోలేని సంఘటన.

--- వి.వి. రమణి, ముంబై. మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్ - 2


కంచి పరమాచార్య వైభవం.

శ్రీ కన్యకురిచి అమ్మ రక్షణ

ఒక రోజు ఒక పెద్దమనిషి పరమాచార్య స్వామి వారి దర్శనం కోసం పట్టుకోట్టై అనే పట్టణం నుండి వచ్చాడు. దర్శనం అనంతరం మహాస్వామి వారితో "నేను ఒక కొత్త కారు కొన్నాను. దాన్ని తీసుకున్నప్పటి నుండి చాలా ప్రమాదాలు జరిగాయి. నేను చాలా మంది జ్యోతిష్కులను అడుగగా, వారు ఎన్నో పరిహారాలు చెప్పారు. వారు చెప్పినవన్నీ చేయించాను కాని ఏమి ఉపయోగం లేదుఅని అన్నాడు.

మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత ఆ పెద్దమనిషిని "మీ ఊరి సమీపంలో కన్యకురిచి అనే ఊరు ఉన్నదా?" అని ప్రశ్నించారు.

ఆ మాటవిని ఆ పెద్దమనిషి చాలా ఆశ్చర్యపోయాడు.

మహాస్వామి వారు ఆ పెద్దమనిషితో "అక్కడ ఒక మహామాయా దేవి ఆలయం ఉన్నది. చాలా శక్తి వంతమైన దేవీ స్వరూపం. ఒక యాభై రూపాయలు పంపి అక్కడ ఉన్న అమ్మవారికి అభిషేకము చేయించు. నీ కారు ముందు కన్యకురిచి అమ్మవారి ప్రసన్నఃఅని అమ్మ రక్షణలో ఈ కారు ఉంది అని రాయించుఅని చెప్పారు.

ఆ పెద్దమనిషి నిశ్చేష్టుడయ్యి, నోట మాటరాక అలా నిలబడిపోయాడు. కొద్దిసేపటి తరువాత తేరుకొని, స్వామివారితో "పెరియవ! శ్రీ కన్యకురిచి అమ్మవారు మా ఇంటిదేవత, వంశపారంపర్యంగా మా ఆరాధ్య దైవం. మా తల్లితండ్రులు ప్రతి సంవత్సరము అక్కడకి వెళ్లి అమ్మవారికి అభిషేకం చేయించేవారు. మా కుటుంబం లోని చిన్నపిల్లలకు అక్కడే పుట్టువెంట్రుకలు తీయించేవారు. కాలక్రమములో మేము ఇవన్ని మరిచిపోయము. శ్రీ మహాపెరియవ దయ వలన మరియు మా అదృష్టం వల్ల మళ్ళీ మాకు గుర్తుచేసారు" అని స్వామివారికి సాష్టాంగం చేసి ఆనందంతో వెళ్ళిపోయాడు.

శ్రీ మహామాయ దేవి రక్షణ వల్ల ఆ కారుకి తరువాత ఎటువంటి ఆపదలు రాలేదు.


--- శ్రీ మఠం బాలు మామ, మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్.

Post a Comment

0 Comments