7 Hills History, ఏడు కొండలు, Edu Kondala History, Tirumala Hills History

7 Hills History, ఏడు కొండలు, Edu Kondala History, Tirumala Hills History

 ఏడు కొండలు,  Edu Kondala History,  Tirumala Hills History, 7 Hills History !  


తిరుమలకు కాలిబాటన నడిచివెళ్ళే భక్తులు ఏడుకొండలవాడా ! వెంకటరమణా !గోవిందా !గోవిందా ! అని ఎలుగెత్తి కీర్తించడం అందరికి తేలిసిందే .  


అయితే ఈ ప్రసిద్ది ఎప్పటినుండి వచ్చిందో కచ్చితంగా తేలియదు  . ఏడుకొండలలో ఒక్కో కొండకు ఒక్కో నామం ఉంది  .  ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర కూడను వుంది . 

ఇందులో 

మొదటిది శ్రీశైలం  . 

ఇది ఇంచుమించు తమిళంలోని `తిరుమలై `అనే మాటకు సరిపోయ్ పదభందం  . `తిరు `మంగళవాచకం  . మలై అంటే కొండ  . శ్రీదేవి నివసిస్తుండడం వల్ల , భక్తులకు శ్రీప్రదం కావడం వల్ల శ్రీశైలమనే పేరు వచ్చింది


రెండవది శేషశైలం  .

 శ్రీమహావిష్ణువు ఆదేశం ప్రకారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఈ పర్వతరూపాన్ని ధరించడం చేత `శేషశైలం `శ్రీమహావిష్ణువు వాయువుకు శేషునికి పందెం పెట్టగా , శేషుడు వెంకటాద్రిని ఆవరించగా , వాయువు మహావేగంతో వీచగా , శేషుడు సువర్ణముఖరీతీరం దాకా కదిలిపోగా , స్వామి ఆజ్ఞతో వేంకటాద్రి విముక్తం కావడంతో , శేషుడు తపం అవరించడం వల్ల `శేషపర్వత`ఖ్యాతి వచ్చింది. 


మూడవది గరుడాచలం  . 

శ్వేతవరాహ కల్పంలో వరాహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మoతుడు శ్రీ వైకుoటము నుండి ఈ పర్వతం తీసుకురావడం వల్ల గరుడాచలం  . 


నాల్గోవధి వేంకటాద్రి  . 

`వేo` కారానికి అమృతమని అర్ధం  . కటం అంటే ఐశ్వర్ర్యం . ఆశ్రితులకు అమృతాన్ని , ఐశ్వర్ర్యంన్ని ప్రసాదించే కొండ అని అభిప్రాయం  . లోకంలోని పాపాలకు `వేo`అని వ్యవహారం  . ఆ పాపాలను ధహించగాలది కావడం వల్ల వెంకటశైలం  . 


ఐదవది నారాయణాద్రి  . 

సాక్షాత్ శ్రీ మన్నానారాయణుడే వాసం చేయడం వల్ల నారాయణాద్రి నారాయణుడనే విప్రుని ప్రాద్దన మన్నిoఛి శ్రీనివాసుడు వాసం చేయడం నారాయణాద్రి


ఆరవధి వృషభాద్రి  . 

వృషభుడనే రాక్షసుడు తపస్సు చేయాగా , తన పేరుతో పర్వతం పిలువబడాలని కోరగా శ్రీనివాసుడు అనుగ్రహించడం వల్ల వృషబాద్రి


ఇక చివరది వృషాద్రి . 

వృష శబ్దానికి ధర్మమని అర్ధం  . తన అభివృద్ధికోసం  . ఈ కొండ మీద ధర్మదేవత తపస్సు చేయడం వల్ల వ్రషాద్రి


ఒక్కక యుగంలో ఈ కొండలన్నిటికీ ఒక్కక పేరు ప్రసిద్దంగా వుండేది  . 

వరాహపురాణం ప్రకారం 

కృత యుగం లో అంజనాద్రి , 

త్రేతా యుగం లో నారయణగిరి , 

ద్వాపరయుగం లో సింహశైలం , 

కలి యుగం లో వెంకటాచలం , 


బవిషోత్తర పురాణం ప్రకారం 

కృతయుగంలో వృషాద్రి , 

త్రేతాయుగంలో అంజనాచలం ,

ద్వాపరయుగంలో శేషశైలం , 

కలియుగంలో వెంకటచలం అని పేర్లు  . 


ఇవే కాక చింతామణి, జ్ఞానద్రి , తిర్దాద్రి , పుష్కరాద్రి , ఆనందాద్రి , నీలాద్రి , నరసింహాద్రి , వరహాద్రి , వైకుంటద్రి , శ్రీ పర్వతమనే పేర్లు ఉన్నాయి  . తమిళ సాహిత్యంలో `తిరువేoగడం `అనే మాటకు ప్రాచుర్యం అర్ధం  . వేంగి +కడం -వేంగి రాజ్యానికి చివరున్న ప్రదేశం కావడంవల్ల వేంగడం  . 


ఏడుకొండల మీద వేంకటేశ్వరుడున్నాడు  . ఇందులో మరొక అధ్యాత్మికత రహస్యం ఉంది  . 


శరీరంలో ఏడు చక్రలున్నాయి  . 

మూలధారం , 

స్వాధిష్టనం, 

మణిపూరకం , 

అనాహతం , 

విశుద్దం , 

ఆజ్ఞ , 

సహాస్రారం - అని ,


అధోముఖమయిన కుండలిని శక్తిని యోగాబ్యాసంతో సహస్రారానికి పయనిoపజేయడం పరమాత్మ సాక్షాత్కరానికి మార్గమని అంటారు  . 

Post a Comment

0 Comments