How Sri Hanuman became very Big, Hindu Hanuman is Huge - హనుమంతుడు ఎంత పెద్దగా పెరిగియున్నాడో గమనించండి

How Sri Hanuman became very Big, Hindu Hanuman is Huge - హనుమంతుడు ఎంత పెద్దగా పెరిగియున్నాడో గమనించండి

ఓ ప్రజలారా! 


ఈ హనుమంతుడు ఎంత పెద్దగా పెరిగియున్నాడో గమనించండి.అనేక విధములైన విద్యలందు నిష్ణాతుడైన ఈ వాయుపుత్రుడు గొప్ప బలము కలిగినవాడు.


ఈ కపిశ్రేష్టుడు  రాక్షసులకు యుద్ధములోనసాధ్యుడు. ఈయన దుస్సహమైన అసహాయ శూరుడు. దిగంతములకు పోయి సంజీవిని గొనితెచ్చిన ధీరోదాత్తుడు.ఆశ్చర్యము గొలుపు ఆకారమును ధరించినవాడు, ఈ ఆంజనేయుడు. 


(అష్ట సిద్దులు ఉన్నవాడగుటచే చిన్న పిల్లిని బోలిన కోతివలె లంకలో సీతను వెదకెను. మున్నుడిలో వివరించినట్లు జానకీ దేవి తననెలా సాగరము దాటింతు వన్నప్పుడు ఆమె తన మాటలను నమ్ముటలేదని విశ్వరూపమును చూపించిన బుద్ధిమంతుడు)


ఈ మారుతి బాగుగా అతిశయించిన ధైర్యముగల పరాక్రమవంతుడు. బలిష్టులైన కవికులంబునకే ఈతడు సార్వభౌముడు. తాకరానిదిగా ప్రసిద్ధి గాంచిన లంకానగరమును దగ్ధము చేనిన శౌర్యవంతుడు. శ్రీరామచంద్రుని తన ఆత్మారామునిగా ప్రతిష్టించుకొనినవాడు. శ్రీరామ లక్ష్మణులను మూర్భనుండి తేర్చుట వంటి పనులు చేసి దేవతలకు దిక్కుగా నిల్చిన ముఖ్యుడు. 


ఎంచగలిగిన తపః ఫలము గల పుణ్యాత్ముడు. ఈ హనుమంతుడు, శ్రీవేంకటేశ్వరుని సేవించు వారందరిలో అగ్రగణ్యుడు. ఎప్పుడూ సావధానుడై సిద్ధముగానున్న ఈవాయునందనుడు అందరికీ శరణము నొసంగు మహానుభావుడు.


పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు |

పరగి నానా విద్యల బలవంతుడు ||


రక్కసుల పాలికి రణరంగ శూరుడు

వెక్కసపు ఏకాంగ వీరుడు |


దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు

అక్కజమైనట్టి ఆకారుడు ||


లలిమీరిన యట్టి లావుల భీముడు

బలు కపికుల సార్వభౌముడు |


నెలకొన్న లంకా నిర్థూమధాముడు

తలపున శ్రీరాము నాత్మారాముడు ||


దేవకార్యముల దిక్కువరేణ్యుడు

భావింపగల తపః ఫల పుణ్యుడు |


శ్రీవేంకటేశ్వర సేవాగ్రగణ్యుడు

సావధానుడు సర్వశరణ్యుడు ||


రచన : శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు 


పాడిన వారు : కుమారి .మాన్య చంద్రన్  - Kum.Manya Chandran


(తిరుమల ఆలయ ప్రధానార్చకులు  వేణుగోపాల దీక్షితులు గారి కుమార్తె )


కీర్తన చివరలో ఆచార్య.కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని Acharya K.S.Avadhani 

(Principal of S.V VedaVignanaPeetham, Dharmagiri, Tirumala) గారు వివరించిన ఈ కీర్తన భావం  తప్పక చూడండి. 


 How Sri Hanuman became very Big, Hindu Hanuman is Huge 





Post a Comment

0 Comments