కాణిపాకం విశిష్టత - Sri Vinayaka in Kanipakam, Lord Ganesha in Kanipakam

Lord Kanipaka Vinayaka in Kanipakam, Lord Ganesha in Kanipakam


*🌻కాణిపాకం విశిష్టత🌻*



ఈ పుణ్యక్షేత్రం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడుకట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు.ఈ ఆలయం లోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది.


*🌻చరిత్ర - 😘 

కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం.చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారి పోయింది. మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు గా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోప తండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరినీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.


*🌻ఏలా వెళ్ళాలి*


 *🚍బస్సు సౌకర్యములు*

తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును. 


*🚆రైలు సౌకర్యములు:*

ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు.


*🛩️విమాన సౌకర్యములు*

తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి విమానాలు ఉన్నాయి.


*🌻కాణిపాకం ఆలయ సమూహము*

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. 


భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. 


ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం."బ్రహ్మహత్యా పాతక నివృత్తి" కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. 


స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.


🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻



భగవద్గీత Part -1 శ్రీ చాగంటి కోటేశ్వర రావు  #chaganti #ChagantiKoteswara...



#భగవద్గీత Part - 1 శ్రీ చాగంటి కోటేశ్వర రావు #bhagavatgita @MotivationalDevotional | Motivational Devotional | హలో ! నమష్కార్ !! @MotivationalDevotional YouTube ఛానెల్‌కు స్వాగతం. ఈ ఛానెల్ జ్ఞానం, ఆరోగ్య చిట్కాలు, మానవత్వం మరియు ప్రేరణ, భక్తి ప్రసంగాలు మరియు కోట్‌లను వ్యాప్తి చేయబోతోంది. ధన్యవాదాలు! దయచేసి LIKE & SHARE & SUBSCRIBE చేయండి ❤️ Please LIKE & SHARE & SUBSCRIBE ❤️    / @motivationaldevo...   భగవద్గీత ప్రవచనం శ్రీ చాగంటి కోటేశ్వరరావు #BhagavadGitaSingleVideoInTelugu #SingleVideo #srichagantipravachanalu #chagantipravachanalu #శ్రీచాగంటికోటేశ్వరరావు #చాగంటిప్రవచనాలు #Srichagantikoteswararaospeeches #chagantikoteswararao #chagantipravachanalu #chagantikoteswararaospeeches #chaganti koteswara rao speeches #Gurusyoutubechannel #sri chaganti koteswara rao pravachanam latest #chaganti koteswara rao speeches latest maharshi sri chaganti koteswara rao #chaganti sri chaganti #chaganti pravachanalu #sri chaganti koteswara rao #BhagavadGitaTeluguAllChapters BhagavadGitaAllChapters #chaganti speeches sri chaganti koteswara rao bhagavad gita #BhagavadGitaInTeluguByChaganti #BhagavadGitaInTelugu చాగంటి వారి గీత మాటలు #chaganti koteswara rao bhagavatam 1. భగవద్గీత Part-1 శ్రీ చాగంటి కోటేశ్వర రావు    • భగవద్గీత Part -1 ...   2. భగవద్గీత Part-2 శ్రీ చాగంటి కోటేశ్వర రావు    • భగవద్గీత Part-2 శ...   3. భగవద్గీత Part-3 శ్రీ చాగంటి కోటేశ్వర రావు    • భగవద్గీత Part-3 శ...   4. భగవద్గీత Part-4 శ్రీ చాగంటి కోటేశ్వర రావు    • భగవద్గీత Part-4 శ...   5. భగవద్గీత Part-5 శ్రీ చాగంటి కోటేశ్వర రావు    • భగవద్గీత Part-5 శ...  



Post a Comment

0 Comments