Jamadagni జమదగ్ని - Janamejayudu జనమేజయుడు - Jaya Vijayulu జయ విజయులు

Jamadagni జమదగ్ని - Janamejayudu జనమేజయుడు - Jaya Vijayulu జయ విజయులు

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు

Jamadagni జమదగ్ని - 
Janamejayudu జనమేజయుడు - 
Jaya Vijayulu జయ విజయులు 

Jamadagni : జమదగ్ని -- 

భృగు వంశానికి చెందిన మహర్షి. పరశురాముడు కి తండ్రి. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు. రేణుక ఈయన భార్య .

Janamejayudu : జనమేజయుడు -- 

మహాభారతంలో పరీక్షిత్తు కుమారుడు. అర్జునునికి ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు ఇతనికి మహాభారత కథను వినిపించెను. మహాభారతంలో చెప్పినట్లుగా జనమేజయుడికి ఆరు మంది అన్నదమ్మలు. వారు కక్ష సేనుడు, ఉగ్ర సేనుడు, చిత్ర సేనుడు, ఇంద్రసేనుడు, సుశేణుడు, నఖ్యశేనుడు. . తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. 

తన తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగము చేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడు పరీక్షత్తు ను చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు.

Jaya Vijayulu : జయ విజయులు -- 

శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వార పాలకులు. వీరి గురించి భాగవత పురాణం లో ఉంది. ఒక సారి బ్రహ్మ యొక్క మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్ధమై వైకుంఠానికి వేంచేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. 

దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాదులు ఆగ్రహించి భూలోకం లో మర్త్యులై సంచరించెదరని శాపం ఇస్తారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదనీ కాకపోతే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు. అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు.


Post a Comment

0 Comments