Potla palli swayamboo rajeswara devalayam temple పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం

Potla palli swayamboo rajeswara devalayam temple పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం

పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయం
++++++++++++++++++++++++++++
ఘన చరిత్రకు, ఎన్నో పురాతన దేవాలయాలకు వేదికైన పొట్లపల్లిపై పురావస్తు శాఖ దష్టి సారిస్తే మరింత విలువైన చారిత్రిక సమాచారం లభ్యమయ్యే అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లాలోని పొట్లపల్లి గ్రామం అనేక ప్రాచీన ఆలయాలకు పేరెన్నిక గన్నది. ఎన్నో చారిత్రిక దేవాలయాలతో ఈ ప్రాంతం అనాదిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
క్రీ.పూ. బహత్ శిలాయుగం నుంచి కాకతీయుల కాలం వరకు చరిత్రనూ ఈ నేల తన కడుపులో దాచుకున్నట్లుగానూ తెలుస్తోంది. ఇక్కడ సుమారు 5 వేల సంవత్సరాల నాటి చారిత్రికాధారాలు లభ్యమైనట్లు చెబుతున్నారు. క్రీ.పూ. 2,500 సంవత్సరంలో ప్రాచీన మానవులు నివసించారని, క్రీ.పూ. 1,000 సంవత్సరంలో ఇక్కడ నాగజాతి నివసించిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆర్యులు, ద్రావిడులు ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారని వారు అంటున్నారు. కళ్యాణి చాళుక్యులు, శాతవాహనులు, రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారని చెప్పారు. కాకతీయుల పాలనలో ఈ గ్రామం ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లిందనటానికి ఆనవాళ్లు కూడాలభ్యమయ్యాయి.

ఇటు ఆలయాలు, అటు సమాధులు

హుస్నాబాద్ మండల కేంద్రానికి 4 కి.మీ., కరీంనగర్ జిల్లా కేంద్రానికి 43 కి.మీ. దూరంలో పొట్లపల్లి గ్రామం ఉంది. ఈ గ్రామ శివారులో రేణుకా వాగు ఉంది. పక్కనే ఎత్తైన గుట్ట, దాని దిగువ ప్రాంతంలో బహత్ శిలాయుగం నాటి ప్రాచీన మానవుల సమాధులు, నాగజాతికి చెందిన నాగులమ్మలు ఉన్నాయి. అలాగే, ఎల్లమ్మ, పరశురాముడు, గుట్టపై ఆంజనేయస్వామి విగ్రహం, గ్రామంలో పురాతన మల్లికార్జున స్వామి దేవాలయం, సీతా రామచంద్రస్వామి దేవాలయం, ఆంజనేయ సహిత శివాలయం, పోచమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ ఆలయాలు ఉన్నాయి. అయితే, ఈ గ్రామం పరిసరాలలో పలు శిలా శాసనాలు, దేవుళ్ల విగ్రహాలు బయల్పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

ఎల్లమ్మ గుట్ట దిగువభాగంలో నేటికీ ప్రాచీన మానవుల సమాధులు కనిపిస్తాయి. చుట్టూ పెద్ద బండలు పేర్చి మధ్యలో పొడువాటి బండలను అమర్చిన సమాధులు బహత్ శిలాయుగం నాటివిగా చరిత్రకారులు తేల్చారు. 2012, జూలై 24న ప్రముఖ చరిత్రకారుడు, ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జైకిషన్, గుజరాత్‌లోని బరోడా విశ్వవిద్యాలయ రీసర్చ్ స్కాలర్‌లు స్మతి చరణ్, రిషబ్, బ్రిటన్‌లోని ఓ విశ్వవిద్యాలయం రీసర్చి స్కాలర్ తత్‌గత్, జిల్లా చరిత్రకారుడు నాగేంద్ర శర్మ పొట్లపల్లి సమాధులపై ఆధ్యయనం చేశారు. ఇవి క్రీ.పూ. 2500 నాటివిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ గుట్టవద్ద బండరాళ్లను పరిశీలించి ఒకప్పుడు ఇక్కడ అగ్నిపర్వతం ఉండేదని, దాని లావాతోనే ఇక్కడ రాళ్లు పొరలుగా మారాయని చెబుతున్నారు.

అయిదు తలలతో నాగుల విగ్రహాలు

నాగదేవతను ఆరాధిస్తూ ఆర్యులు ఏర్పాటు చేసిన నాగులమ్మల విగ్రహాలు ఎల్లమ్మ గుట్ట దిగువ ప్రాంతంలో ఉన్నాయి. అయిదు తలలతో ఉన్న నాగుల విగ్రహాలు ఏడు ఇక్కడ ప్రతిష్టింపబడ్డట్టు తెలుస్తోంది. ఆ కాలంలో నాగజాతి ఇక్కడ నివసించేదని, ఈ కారణంగానే పొట్టపల్లి నాగపట్నంగా పిలువబడినట్లు జిల్లాకు చెందిన చరిత్రకారుడు డాక్టర్ మలయశ్రీ వెల్లడించారు. అనంతరం ఇక్కడ నివసించిన ద్రావిడులు నాగజాతిని అంతం చేసి తమ ఆధిపత్యాన్ని కొనసాగించారని, దీనికి గుర్తుగా ద్రావిడులు గ్రామ చెరువు సమీపంలో నాగుపామును కత్తితో రెండుగా చీల్చిన శిల్పం ఏర్పాటు చేసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
క్రీ.పూ. 230 నుంచి క్రీస్తు శకం 100 వరకు శాతవాహనుల పరిపాలనలో ఈ గ్రామం ఉండేదని అంటున్నారు. అప్పుడు పొట్లపల్లిలో సుమారు 400ల బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవిట. వారు నివసించిన స్థలాన్నే ఇప్పడు
బ్రాహ్మణుల దిబ్బగా పిలుస్తుండడం గమనార్హం.

శాతవాహనుల అనంతరం కళ్యాణి చాళుక్యులు ఇక్కడ పరిపాలన చేశారని, వారు వేయించిన పలు శాసనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయని చెబుతున్నారు. రెండో ప్రోలరాజు, రెండో బేతరాజులు పొట్లపల్లిని పరిపాలించారు. వీరి పాలనలో ఇక్కడ పంచమఠ స్థానాలు ఉండేవని చరిత్రకారుల అభిప్రాయం. అనంతరం పొట్లపల్లి రాష్ట్రకూటుల పాలనలోకి వెళ్లింది. ఇక్కడ ఉన్న శాసనాల్లో రాకొండ చంద్రయ్య అనే వ్యక్తికి త్రైలోక్య చక్రమల్లు అనే చక్రవర్తి క్రీస్తుశకం 1066 సంవత్సరం ఆదివారం రోజున దానాలు చేసినట్లు చెక్కబడి ఉన్నట్టు చెబుతున్నారు.
101 శివాలయాల చరిత్ర

మరో శాసనంలో మల్లిప్ప అనే వ్యక్తికి రాటం (మోట బొక్కెన) దానమిచ్చినట్లు ఉంది. ఈ శాసనాలు కన్నడ, సంస్కత భాషల్లో ఉన్నట్లు డాక్టర్ మలయశ్రీ విశ్లేషించారు. కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో ఈ గ్రామంలో 101 శివాలయాలు నిర్మించారని, వాటిలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ లింగాన్ని పోలిన లింగాలే ఉండేవని చరిత్రకారులు అంటున్నారు.
పొట్లపల్లి నుంచి పందిల్ల వరకు ప్రతి శివరాత్రికి తాటాకుల పందిళ్లు వేసి ఉత్సవాలు నిర్వహించేవారు. ఇందువల్లే పందిల్ల గ్రామానికి ఆ పేరొచ్చింది. కాకతీయుల పరిపాలనకు తెరపడడంతో ఇక్కడి ఆలయాలను భూస్థాపితం చేశారనే వాదనలు ఉన్నాయి. 1996 ఆగస్టులో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రహరీ గోడ నిర్మించేందుకు పునాది తీయగా కాకతీయుల కాలం నాటి శివలింగం ఒకటి బయల్పడింది. లింగం సమీపంలోనే పార, ఇతర వస్తువులు లభించాయి. ఇక్కడ బయల్పడ్డ లింగానికి రేణుకా వాగు సమీపంలో ఆలయం నిర్మించారు.

పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర దేవాలయానికి గాలిగోపురం నిర్మించేందుకు 2012 జూన్ 18వ తేదీన ఆలయం ఎదుట గొయ్యి తవ్వగా ప్రాచీన గాజుబావి ఒకటి బయల్పడింది. ఇది సుమారు 700ల ఏళ్ల క్రితం నాటిదని పురావస్తుశాఖ అధికారులు తేల్చారు. అలాగే అనేక రకాల శిల్పాలు పలుచోట్ల బయల్పడ్డాయి. వాటిలో కాలభైరవుడు, పోలేరమ్మ, నాగులమ్మ వంటి విగ్రహాలు ఉన్నాయి.
సేకరణ : గూగుల్ సర్చ్ నుండి.

Post a Comment

0 Comments